వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది…..

విమాన ఇంధనాన్ని (ఎస్‌ఏఎఫ్‌) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్‌ అయింది.....

అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా మార్పులు చెందుతున్న సమయంలో తాజాగా విమాన రంగంలో మరో మార్పు చోటు చేసుకుంది.. అది కూడా ఓ సంచలనం..
ఫ్రాన్స్‌లోని టౌలూస్‌ బ్లాగ్నక్‌ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్‌ విమాన ఇంధనాన్ని (ఎస్‌ఏఎఫ్‌) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్‌ అయింది…

వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది. అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్‌ జంబో విమానం ఎయిర్‌బస్‌ ఏ-380 పెట్రోల్‌ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది….గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్‌ బ్లాగ్నక్‌ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్‌ విమాన ఇంధనాన్ని (ఎస్‌ఏఎఫ్‌) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్‌ అయింది. మూడు గంటల ప్రయాణం తర్వాత నైస్‌ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. 100 శాతం ఎస్‌ఏఎఫ్‌తో నింగిలోకి ఎగిరిన తొలి విమానంగా ఎయిర్‌బస్‌ ఏ-380 రికార్డులకెక్కింది. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయిన కాలంలో వంటనూనెతో ప్రయాణం అంటే చాలా ఖరీదుగానే భావించాలి. అందులోనూ ప్రస్తుతం పెట్రోల్ కంటే వంటనూనె ధరలే అధికంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ వంటనూనెతో విమానాలు ప్రయాణిస్తే విమానయాన రంగం ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి…