కుప్పకూలిన విమానం..133 మంది మృతి..

133 మంది ప్రయాణికులతో ఊజ్‌హు సిటి నుండి సోమవారం మధ్యాహ్నం 1.11 నుంచి బయలుదేరిన ‘చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానం 2.22 గంటలకు ప్రమాదానికి గురైంది. గ్వాంగ్చీ ప్రాంతంలోని కొండల్లో విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు చైనా అధికారిక ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. ప్రమాదం జరిగిన కొండ ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి…. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించారు. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా దగ్ధమైంది. కన్ మింగ్ నుంచి వెళ్తుండగా గ్వాంగ్జీ ప్రాంతంలోని వుజౌ నగరానికి సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ అయి ప్రమాదం జరిగింది. పర్వతాలలో మంటలు చెలరేగాయని సీసీటీవీ ఫుటేజ్ తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు..ప్రమాదానికి గురైన విమానాన్ని 2015లో బోయింగ్ సంస్థ చైనా ఈస్టర్న్ కంపెనీకి డెలివరీ చేసింది. ఈ విమానం ఆరేళ్లుగా సేవలు అందిస్తోంది. ఇందులో రెండు ఇంజిన్‌లు ఉంటాయి. బోయింగ్ 737 ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన విమానాలలో ఒకటి. చైనా ఈస్టర్న్ కంపెనీ 737-800, 737 మాక్స్‌తో సహా సాధారణ విమాన సేవలను సైతం అందిస్తోంది…