న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇడియా విమానంలో మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘోర సంఘటనపై ఎయిర్ ఇండియా నుంచి నివేదికను కోరినట్లు పౌరవిమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్(డిజిసిఎ) బుధవారం తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి నిర్లక్షంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని డిజిసిఎ తెలిపింది. కాగా..ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు ఖరారు చేసేందుకు ఒక అంతర్గత కమిటీని ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది.గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి డిల్లీ ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ సంఘనపై పోలీసులకు, డిజిసిఎ అధికారులకు ఫిర్యాదు చేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. తోటి ప్రయాణికురాలి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకోవలసింది వారేనని ఆయన చెప్పారు. దర్యాప్తులో భాగంగా బాధిత మహిళా ప్రయాణికురాలు, ఆమె కుటుంబంతో తరచు సంప్రదింపులు జరుపుతున్నట్లు డిజిసిఎ అధికారులు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.