ప్రపంచ చరిత్రలోనే..ఎయిరిండియా బిగ్‌ డీల్‌, 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం!

ఎయిర్‌ షోలో ఎయిరిండియా బిగ్‌ డీల్‌ కుదుర్చుకుంది. 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌ బస్‌, బోయింగ్‌ సంస్థల నుంచి 500 విమానాల కొనుగోలుకు డీల్‌ కుదిరింది..

ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో వీడియో కాన్ఫిరెన్స్‌లో మోదీ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎయిరిండియా చైర్మన్‌ రతన్‌ టాటా పాల్గొన్నారు.