శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత..!!!

శంషాబాద్(Shamshabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Airfort) కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని (Gold Seized) పట్టుకున్నారు..దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో భాగంగా ఓ ప్రయాణికుడిపై అనుమానం రాగా.. లగేజీ బ్యాగును స్కాన్ చేశారు. అందులో బంగారం ఉన్నట్లు తేలింది. అతని వద్ద నుంచి 610 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.32.8లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే మరో ప్రయాణికుడి నుంచి 483 గ్రాముల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు..