Airtel ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త…49 ఖర్చు ద్వారా అపరిమిత డేటా..!!.

నెట్వర్క్ టేలికాం దిగ్గజ సంస్థ Airtel ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. కొత్త వినియోగదారులను తెచ్చుకునేందుకు, పాత వినియోగదారులను సంతోష పెట్టేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది..
ఈ క్రమంలోనే మరో కొత్త ప్యాక్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఎయిర్టెల్ కంపెనీ రూ. 49 డేటా ప్యాక్‌తో మునుపటి కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. దీంతో పాటు ఇంకా ఎలాంటి ఆఫర్ లpను అందుబాటులోకి తీసుకువచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ 49 ప్లాన్ వివరాలు..

49 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో ఇంతకుముందు కంపెనీ వినియోగదారులకు 6 GB హై-స్పీడ్ డేటాను మాత్రమే అందించింది. కానీ ఇప్పుడు రూ. 49 ఖర్చు చేయడం ద్వారా మీరు అపరిమిత డేటా ప్రయోజనం పొందుతారు. ..Airtel 49 ప్లాన్ వాలిడిటీ..

రూ. 49 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీకు 1 రోజు వాలిడిటీ వస్తుంది. అయితే ఈ ప్లాన్ FUP పరిమితి 20 GBతో వస్తుంది. అంటే డేటా అపరిమితంగా ఉంటుంది కానీ 20 GB డేటాను ఉపయోగించిన తర్వాత, వేగం 64 Kbpsకి తగ్గిస్తారు. ఈ పద్ధతిలో చూస్తే ఒక్కో జీబీ ధర రూ.2.45 పైసలు మాత్రమే.

మరో అపరిమిత ప్లాన్…

రూ. 49 కాకుండా ఎయిర్‌టెల్ రూ. 100 కంటే తక్కువ డేటా ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా వినియోగదారులకు అపరిమిత డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్ 99 ప్లాన్‌తో, మీకు రూ. 49 లాగా ఒకటికి బదులుగా రెండు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ కూడా 20 GB FUP పరిమితితో అందుబాటులో ఉంది…