నటి ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు…

R9TELUGUNEWS.COM
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల లీకేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. విచారణ నిమిత్తం సోమవారమే ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విచారణ విషయమై గతంలోనే సమన్ల జారీ చేయగా.. ఆమె వాయిదా కోరినట్లు కొన్ని జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి._