అఖండ 9 డేస్ కలెక్షన్స్.. వామ్మో బాలయ్య ఈ రేంజిలో ఏందయ్యా..

అఖండ 9 డేస్ కలెక్షన్స్..బాలయ్య అరాచకం కంటిన్యూ..

R9TELUGUNEWS.COM. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈయన నటించిన అఖండ సినిమా ఆకట్టుకునే వసూళ్లు సాధిస్తోంది. రెండో వారం కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. రోజుకు కనీసం రెండు కోట్లకు తగ్గకుండా షేర్ వచ్చింది. సెకండ్ వీకెండ్ కచ్చితంగా ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా 9 రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి చూద్దాం..

నైజాం: 15.71 కోట్లు
సీడెడ్: 12.23 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.84 కోట్లు
ఈస్ట్: 3.34 కోట్లు
వెస్ట్: 2.64 కోట్లు
గుంటూరు: 3.88 కోట్లు
కృష్ణా: 2.86 కోట్లు
నెల్లూరు: 2.09 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 47.60 కోట్లు (75.00 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.91 కోట్లు
ఓవర్సీస్: 4.65 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 9 డేస్ కలెక్షన్స్: 56.15 కోట్లు (93.25 కోట్లు గ్రాస్)

అఖండ సినిమాకు రూ.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 9 రోజుల్లోనే రూ.56.15 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికే లక్ష్యం కంటే 2.2 కోట్ల లాభాలు వచ్చాయి. అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చింది అఖండ సినిమా..