అక్షయ గోల్డ్‌ డిపాజిటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అక్షయ గోల్డ్‌ డిపాజిటర్లు…

అక్షయ గోల్డ్‌ డిపాజిటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం కొత్తగా తెచ్చిన అక్రమ డిపాజిట్ల సేకరణ చట్టం ప్రకారం.. న్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని డిపాజిటర్లు కోరారు. కొత్త చట్ట ప్రకారం 180 రోజుల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉన్న.. పదేళ్లు దాటినా బాధితులకు న్యాయం జరగలేదన్న పిటిషన్‌ తరపు లాయర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేంద్రమంత్రి నిర్మల లేఖను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోలేదని పిటిషనర్లు వాపోయారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని బాధితులకు సుప్రీం సూచించింది. ఆస్తులను కోర్టుల్లో జమ చేసినా వాటిని బాధితులకు అందజేయలేదని, అక్షయగోల్డ్‌, అగ్రిగోల్డ్‌ సహా దేశవ్యాప్తంగా 1608 కంపెనీలపై నమోదయ్యాయని, ఏపీ, తెలంగాణలో 50 లక్షల మందికి పైగా మోసపోయారని పిటిషనర్‌ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.