బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం..

బాలీవుడ్ చిత్రం బచ్చన్ పాండే‌పై విమర్శల వెల్లువ ఎత్తుతున్నది. అక్షయ్ కుమార్, కృతిసనన్ నటించిన ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బ తీసిందని అభ్యంతరం తెలియజేస్తూ ఉత్తరాదిలోని ఓ వర్గం ఆరోపణలు చేసింది. ఈ సినిమాను బాయ్ కాట్ చచేయాలంటూ నెట్ జన్లు ఆగ్రహం వ్యక్తమైంది..బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ కొత్త సినిమా బచ్చన్‌ పాండే ఈ నెల‌ 18న విడుదల అయ్యింది… అయితే, ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ హింసాత్మక నేరస్థుడిగా క‌న‌ప‌డ‌డం, ఆయ‌న ప్ర‌జ‌ల‌ను హ‌త్య‌లు చేయ‌డం వంటి సీన్లు ఉన్నాయి. ఇటువంటి సినిమాకు పాండే వంటి గొప్ప‌ యోధుడి పేరును వాడ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు….హిందువులను కించపరిచే విధంగా అక్ష‌య్ కుమార్‌ పాత్రను చిత్రీకరించారని కొంద‌రు అంటున్నారు. కాగా, తమిళ సినిమా ‘జిగర్తాండా’కు రీమేక్ గా తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే హిందీలో బచ్చన్‌ పాండేగా రూపొందించారు. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, కృతి సనన్‌, అర్షద్‌ వార్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ..