నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్..

తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్ బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. ‍‍హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ వేదికగా అలాయ్ బలాయ్ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్‌ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
2005లో గవర్నర్ బండారు దత్తాత్రేయ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ వంటలు రుచి చూపించనున్నారు. ఏటా దసరా సందర్భంగా అలయ్.. బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సూపర్‌హిట్‌ కొట్టిన మరుసటి రోజే ఇక్కడికి వచ్చాను గాడ్‌ఫాదర్‌ను సూపర్‌హిట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు గత ఏడాది మా తమ్ముడికి అవకాశం వచ్చింది దత్తన్న దృష్టిలో ఎందుకు పడలేదని అనుకున్నా అలయ్‌ బలయ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది అలయ్‌ బలయ్‌ ఎంతో గొప్ప కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తారు…