టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ , ఏపీ సీఎం జగన్ భేటీ..

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు.

ఇటీవల ఇతర సినీ ప్రముఖులతో కలిసి తన వద్దకు వచ్చిన అలీని, మరోసారి కలవాలంటూ సీఎం జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో అలీ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

సీఎం జగన్ తో సమావేశమయ్యారు. అలీకి వైసీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

2019 ఎన్నికల వేళ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే.

గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని అలీ ఆశించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, స్థానిక సమీకరణాల దృష్ట్యా వైసీపీ అధినాయకత్వం సీటు ఇవ్వలేకపోయింది.

అయినప్పటికీ అలీ పార్టీ కోసం విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు.