ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ సింధు రెడ్డి :రికార్డ్ బ్రేక్

ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు రెడ్డి సింగిల్స్, డబుల్స్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది.

రాజస్థాన్లోని ఉదయపూర్ లో నిర్వహించిన ఆల్ ఇండియా జోనల్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో శంషాబాద్‌లో ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సింధు రెడ్డి మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలిచింది.

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణకు చెందిన సింధు రెడ్డి సింగిల్స్, డబుల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలవడం విశేషం.

సింధు రెడ్డి మామ అనుమాండ్ల లక్ష్మారెడ్డి కరీంనగర్ కమిషనరేట్ లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సింధు రెడ్డి ఛాంపియన్‌గా నిలవడం పట్ల శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు..