మన అతిపెద్ద మతం మానవత్వమే…మాకు దేశమే తొలి ప్రాధాన్యం.ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (ఏఐఐవో) చీఫ్ ఇమామ్ ఉమెర్ అహ్మద్ ఇల్యాసి..

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (ఏఐఐవో) చీఫ్ ఇమామ్ ఉమెర్ అహ్మద్ ఇల్యాసి హాజరయ్యారు..
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ”ఇది నవభారత ముఖచిత్రం… మన అతిపెద్ద మతం మానవత్వమే… మాకు దేశమే తొలి ప్రాధాన్యం”అని అన్నారు.

ప్రాణ ప్రతిష్ఠ వేడుకగా ఎంతో అద్భుతంగా జరిగిందని కొనియాడారు. ఈ వేడుకకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా భేటీ అయినట్టు గుర్తు చేశారు. సద్గురు జగదీశ్ వాసుదేవ్‌తో కూడా చర్చా వేదికలు పంచుకున్నట్టు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కూడా 2022, సెప్టెంబర్‌లో ఇల్యాసి భేటీ అయ్యారు. మోహన్ భగవత్‌ను జాతిపితగా అభివర్ణించారు.