నాకోసం నా అల్లుడు ప్రచారం చేస్తారు..అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి..

కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగర్జున సాగర్ నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాల్లో చేపట్టి జనంలోకి వెళ్తున్నారు. అధిష్టానం టికెట్ ఇస్తే నాగర్జున సాగర్ బరిలో ఉంటానని కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సారి తనకు టికెట్ ఇస్తే.. తన అల్లుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన కోసం ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ సేవలు రాజకీయంగా తనకు అవసరమని.. 2014లో తాను ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేశానని.. అప్పట్లో అర్జున్ తన తరుఫున ప్రచారం చేయలేదన్నారు. కానీ, ఈ సారి బీఆర్ఎస్ నాగార్జున సాగర్ టికెట్ ఇస్తే.. అల్లు అర్జున్ తన కోసం బరిలోకి దిగుతాడని ఆయన పేర్కొన్నారు. దీంతో మామ కోసం అల్లుడు ప్రచారం చేస్తాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది… ఇది సాధ్యం అవుతుందా కదా ఆని రనున్నారోజులో చూడాలి అంటున్నారు.. స్థానికులు..