అవన్నీకేవలం పుకార్లు మాత్రమే.. నాపై అసత్య ప్రచారం మానుకోవాలి: ఆమని

నాపై అసత్య ప్రచారం మానుకోవాలి: ఆమని

తన ఆరోగ్యం గురించి గత కొన్నిరోజులుగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటి ఆమని అన్నారు…. ‘శుభలగ్నం’తో తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఆమని ప్రస్తుతం పలు సినిమాల్లో సహాయనటిగా చేస్తున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా మంచిర్యాలకు వెళ్లిన ఆమె అస్వస్థతకు గురయ్యారని ఇటీవల పలు పత్రికల్లో వరుస కథనాలు వచ్చాయి. వీటిపై తాజాగా ఆమని స్పందించారు. ‘గత కొన్నిరోజులుగా నా ఆరోగ్యంపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. నేను గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నానని ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఓ సినిమా షూట్‌ కోసం ఇటీవల మంచిర్యాలకు వెళ్లాను. ఫుడ్‌పాయిజన్‌ కావడంతో సెట్‌లో ఉన్న 20 మంది వరకూ అస్వస్థతకు లోనయ్యాం. వెంటనే చికిత్స తీసుకున్నాం. ఇప్పుడు నేను క్షేమంగానే ఉన్నాను. నాకు ఎలాంటి గుండెపోటు రాలేదు. నటీనటులపై ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదు’ అని ఆమని స్పష్టతనిచ్చారు