నేడు అమావాస్య..ఏయే రాశులపై ప్రభావం చూపనుందో తెలుసుకోండి…

హిందూ సంప్రదాయం ప్రకారం, అమావాస్యను అశుభ దినంగా పరిగణిస్తారు. ఈ రోజు ఎలాంటి పనులు చేపట్టకూడదు అంటారు. ఈ నేపథ్యంలో నేడు (March 2 2022) సంభవించబోయే అమావాస్య (New Moon) ఏయే రాశులపై (Horoscope March 2, 2022) ఎలాంటి ప్రభావం చూపనుందో ఓ లుక్కేద్దాం.
కాలం నడుస్తోంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కచ్చిమైన ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నిస్తారు.

మేషం (Aries) : ఈ రాశివారికి మిశ్రమ కాలం నడుస్తోంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కచ్చిమైన ప్రణాళికతో పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నిస్తారు. ..

వృషభం (Taurus) : ఈరోజు ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక విషయంలో తోటివారి సాయం అందుతుంది. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.

మిథునం (Gemini) : మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం అందుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు.
సభ్యుల సహకారంతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ అధికమవుతుంది. గొదవలకు దూరంగా ఉంటే మంచిది…

కర్కాటకం (Cancer): కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ అధికమవుతుంది. గొదవలకు దూరంగా ఉంటే మంచిది.

సింహం (Leo) : ఈ రోజు ఈ రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం అందుతుంది. కీలక విషయాల్లో మెదడు చురుకుగా పనిచేస్తుంది. మీ భావోద్వేగాలను నియంత్రించడం మానేయండి.

కన్య (Virgo): ఈ రాశివారికి లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

తుల (Libra): వీరు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. విహారయాత్రలు, పనిపై ఇతర ప్రదేశాలకు వెళ్లడం లాంటి ప్రణాళికలు రచిస్తారు.

వృశ్చికం (Scorpio) : ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది.

ధనుస్సు ((Sagittarius): దనస్సు రాశి వారికి ఈ అమావాస్య అంతగా కలిసిరాకపోవచ్చు. వీరు కీలక వ్యవహారాల్లో తోటివారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి మేధస్సుతో కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు.

మకరం (Capricorn) : ఈ రోజు ఈ అమావాస్య మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇతరులతో మాట్లాడటం ద్వారా మీరు ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు.

కుంభం (Aquarius) : ఈ రాశివారికి సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆనందకరమైన జీవితాన్నిగడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి.

మీనం (Pisces) : ఈ అమావాస్య మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు పొందుతారు. సానుకూల ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కూడా ఉంది..