అమెజాన్ అడవుల్లో అద్భుతం… 40 రోజుల క్రితం ప్రమాదవశాత్తు తప్పిపోయిన విమానం నలుగురు చిన్నారులు సజీవం..
దక్షిణ అమెరికాలోని కొలంబియా (Colombia) లో గల అమెజాన్ అడవుల్లో (Amazon Forest) అద్భుతం జరిగింది. 40 రోజుల క్రితం ప్రమాదవశాత్తు తప్పిపోయిన విమాన నలుగురు చిన్నారులు సజీవంగా కనిపించారు. వివరాల్లోకి వెళితే..అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1వ తేదీన ఓ విమానం బయలుదేరింది. అందులో పైలట్, గైడ్ సహా నలుగురు చిన్నారులు, వారి తల్లి ఉన్నారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా అమెజాన్ అడవిలో కూలిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ‘ఆపరేషన్ హోప్’ పేరుతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16వ తేదీన విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలట్,చిన్నారుల తల్లి, గైడ్ మృతదేహాలు కనిపించాయి..