క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్సీపీ కి గుడ్ బై…

పాలిటిక్స్ నా సెకండ్ ఇన్నింగ్స్’ అంటూ వారం రోజుల క్రితమే వైఎస్సార్సీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి ఇవాళ గుడ్ బై చెప్పారు..పాలిటిక్స్ నా సెకండ్ ఇన్నింగ్స్’ అంటూ వారం రోజుల క్రితమే వైఎస్సార్సీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి ఇవాళ గుడ్ బై చెప్పారు. ‘వైఎస్సార్సీపీని వీడుతున్నాను.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తాను’ అని ఆయన ట్వీట్ చేశారు..కాగా, డిసెంబర్ 28 తేదీన వైఎస్సార్సీపీలో జాయిన్ అయ్యారు అంబటి రాయుడు. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంప్‌ ఆఫీసులో ఆ పార్టీ చేరారు. అంబటికి సీఎం జగన్‌ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెట్టినట్లు పేర్కొన్నారు.

తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు.

ఇంతలోనే అంబటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని ఎందుకు వీడుతున్నానన్న విషయాన్ని అంబటి రాయుడు ప్రకటించలేదు.కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..