జనవరి 18వ తేదీ నుంచి అంబేద్కర్ వర్శిటీ బీఈడీ పరీక్షలు..

R9TELUGUNEWS.COM.: డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ బీఈడీ రెండో సంవత్సరం పరీక్షలు 2022 జనవరి, 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు , మొదటి సంవత్సరం పరీక్షలు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీవరకు నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

పరీక్షకు హాజరు కాగోరే విద్యార్ధులు వర్శిటీ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం ఫీజును టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్లు లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ కోసం చివరి తేదీ డిసెంబరు 23వ తేదీగా అధికారులు తెలిపారు. హరిన్ని వివరాల కోసం అభ్యర్దులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారి సంబంధిత అధ్యయన కేంద్రంలో లేదా 040 23680241, 254 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.