అమెరికాలో కాల్పులు…బాపట్ల జిల్లాకు చెందిన గోపికృష్ణ మృతి..!

*అమెరికాలో కాల్పులు..*

బాపట్ల జిల్లాకు చెందిన గోపికృష్ణ మృతి

అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు.

మృతుడిని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే..

కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు.

ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు.

శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా..
ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు.

తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.

ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.