అమెరికా అంతటా విమాన సర్వీసులకు ఆటంకం..

అమెరికా అంతటా విమాన సర్వీసులకు ఆటంకం

అగ్రరాజ్యం అమెరికా అంతటా విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడంతో విమాన సర్వీసులు నిలిపివేసినట్లు అమెరికా మీడియా తెలిపింది. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలెర్ట్‌ చేసేందుకు ఎఫ్‌ఏఏ ఇచ్చే నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌)లో సమస్య ఏర్పడింది. దీంతో అమెరికా అంతటా దాదాపు 400 విమానాలు నిలిచిపోయాయి.