భారత్‌ తీసుకువచ్చిన సాగు చట్టాలను అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది..

భారత్‌ తీసుకువచ్చిన సాగు చట్టాలను అగ్రరాజ్యం అమెరికా స్వాగతించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలను ఉద్దేశించి తీసుకువచ్చిన ఈ చట్టాలతో భారతీయ మార్కెట్ల సామర్థ్యం పెరుగుతాయని, రైతులకు కూడా మార్కెట్‌ పరిధి విస్తృతమవుతుందని అమెరికా విదేశాంగ శాఖ, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపాయి. అదే సమయంలో శాంతియుత మార్గంలో జరుగుతున్న రైతుల ఆందోళనను ప్రశంసించాయి. భారత్‌లో రైతులు జరుపుతున్న ఆందోళనపై వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో చర్చించనున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది.