చరిత్ర లో చూడని నరకం చూస్తున్న అమెరికా…

చలి కాలం వస్తుంది అంటే చాలు…
అమెరికాలో ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతూ ఉంటాయి... దీనితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అమెరికాలోనే కాదు యూరప్ దేశాల్లో కూడా పరిస్థితి చాలా దారుణం. అయితే ఇప్పుడు అమెరికాలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది. అమెరికాలో కీలక నగరాలు అన్నీ కూడా మంచు దుప్పటి కప్పుకుని ఇబ్బంది పడుతున్నాయి.టెక్సాస్ లో అయితే ఇళ్ళల్లో కూడా మంచు పేరుకుపోతుంది. అక్కడ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యాయి. సహజ వాయువు బావులు మరియు పైపులైన్లతో పాటు, విండ్ టర్బైన్ల మీద కూడా మంచు పేరుకుపోయింది. అక్కడ మంచి నీళ్ళు తాగడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళపై ఉన్న వాటర్ తాంక్స్ కూడా మంచు గడ్డ కట్టుకుపోయి ఉన్నాయి…కొన్ని ఇళ్ళల్లో అయితే టాయిలెట్స్ లో కూడా మంచు ఉండిపోయింది. మంచు దెబ్బకు విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది. వ్యాపార సముదాయాలను కూడా మూసివేసారు. రోడ్ల మీద భారీగా మంచు పడటంతో ప్రభుత్వ విభాగాలు అన్నీ కూడా రవాణా వ్యవస్థను మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టం 40 ఏళ్లలో అత్యంత ఘోరంగా ఉందని పోర్ట్‌ల్యాండ్ జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ మరియా పోప్ అసోసియేటెడ్ మీడియాకు వివరించారు..ప్రజలు బయటకు రావడానికి కూడా మంచు ఇబ్బంది పెట్టేస్తుంది. నీళ్ళు వేడి చేసుకున్నా సరే అవి వెంటనే చలికి గడ్డ కట్టుకుపోవడం జరుగుతుంది. వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టి వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఆహరం లేని వారికి ఆహారం అందించడమే కాకుండా… ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లిస్తుంది. అయితే ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుంది అనే దానిపై స్పష్టత రావడం లేదు.