అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మృతి..

ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన ఇద్ద‌రు తెలుగు యువ‌కులు అక్క‌డే ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. వారు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే విగ‌తజీవులుగా ప‌డిఉండ‌టం చూసి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గట్టు వెంకన్న కుమారుడు గట్టు దినేశ్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. పదహారు రోజుల క్రితం వెంకన్న కుటుంబంతో సహా ఎయిర్ పోర్టుకు వెళ్లి కొడుకుకు సెండాఫ్ ఇచ్చాడు.

ఇంతలోనే దినేశ్ చని పోయాడంటూ అమెరికా పోలీసుల నుంచి సమా చారం అందింది. దినేశ్‌తో అదే రూంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మ‌రో విద్యార్ధి కూడా మ‌ర‌ణిం చాడ‌ని శ్రీకాకుళంలోని వారి బంధువుల‌కూ స‌మాచారం పంపారు.

ఈ ఇద్ద‌రు నిదుర‌లో ఉండ‌గానే క‌న్నుమూశార‌ని పోలీసులు ప్రాద‌మిక ద‌ర్యాప్తులో వెల్ల‌డించారు. పోస్ట్ మార్ట‌మ్ అనంత‌ర‌మే మ‌ర‌ణానికి కార‌ణాలు వెల్ల‌డిస్తామ‌ని అధికారులు చెప్పారు. త్వ‌ర‌లోనే వారి మృత‌దేహాల‌ను ఇండి యాకు పంపుతామ‌న్నారు..