చైనా, అమెరికా మధ్య ఫ్లైట్లో రద్దు వివాదం.. దిమ్మతిరిగే షాకిచ్చిన అమెరికా..

అమెరికన్‌, డెల్టా, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్ని ఉన్నపళంగా డిసెంబర్ 31 నుంచి రద్దు చేసింది. పైగా టేకాఫ్‌కు ముందు ఈ విమానాల్లో ప్రయాణించిన వాళ్లకు నెగెటివ్‌ ఉందని, తీరా చైనాకి చేరుకున్నాక పాజిటివ్‌ వచ్చిందని చైనా ఏవియేషన్‌ ప్రకటించడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి బీజింగ్‌కు వెళ్లాల్సిన 44 విమానాల్ని రద్దు చేస్తున్నట్లు ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి ఆశ్చర్యపర్చింది. ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌, గ్జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌..విమానాల్ని మార్చి 29 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ‘‘డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైనవి. అస్థిరమైన చర్యల్ని చూస్తూ ఊరుకోబోం’’ అని యూఎస్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ పకటించింది. వింటర్‌ ఒలింపిక్స్‌ కు సరిగ్గా మూడు వారాల ముందుగా చోటు చేసుకున్న ఫ్లైట్‌ ఫైట్‌ పరిణామం ఆసక్తికర చర్చకు తెరలేపుతుందేమో చూడాలి…