అమెజాన్ మరో గొప్ప ఆఫర్లతో వస్తోంది. ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లు,..

..

ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ మరో గొప్ప ఆఫర్లతో వస్తోంది. ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఫిబ్రవరి 27 నుంచి అంటే రేపట్నించి ప్రారంభం కానున్నాయి. బోట్, వన్‌ప్లస్, నాయిస్, బ్లాపంక్ట్, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఉత్పత్తులపై అదనంగా 7.5 శాతం డిస్కౌంట్ అంటే 2 వేల వరకూ డిస్కౌంట్ లభించవచ్చు. హెచ్ఎస్‌బీసీ, ఛార్టెట్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో ఉన్న బెస్ట్ ఆఫర్లేంటనేది….

HP 14s 11th Gen Intel Core i3.
ఈ ల్యాప్‌టాప్ 19 శాతం డిస్కౌంట్‌తో 41 వేల 990 రూపాయలకే అందుతుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కలిగి ఉంది. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉండటం మరో విశేషం.

Victus-HP Ryzen 7-5800H
ఇదొక అద్భుతమైన ల్యాప్‌టాప్, 14 శాతం డిస్కౌంట్తో 89 వేల 990 రూపాయలకే ఈ ల్యాప్‌‌టాప్ అందుతుంది. దీని అసలు ధర 1 లక్షా 4 వేల 91 రూపాయలుగా ఉంది. 16.1 పుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డి, 4జీబీ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డు, అలెక్సా ఇన్‌బిల్ట్, విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ సౌకర్యాలతో ఈ ల్యాప్టాప్ లభించనుంది.

boAt Rockerz 425
వైర్‌లెస్ హెడ్ ఫోన్స్ ఇవి. 25 గంటల ప్లేటైమ్, బ్లూటూత్ వి 5.2, డ్యూయల్ పేరింగ్ ఇతర సౌకర్యాలతో వస్తుంది. 43 శాతం డిస్కౌంట్‌తో 1699 రూపాయలకే లభిస్తుంది. అసలు ధర 2 వేల 999 రూపాయలుగా ఉంది.

లెనోవా ఐడియా Centre AIO3

ఇదొక ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్. 23.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ఐపీఎస్ 3 సైడ్ డిస్‌‌ప్లేతో వస్తుంది. 23 శాతం డిస్కౌంట్‌తో కేవలం 57 వేల 990 రూపాయలకే లభించనుంది. ఏఎండీ రైజెన్ 5తో పవర్ చేయబడి..8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డితో వస్తుంది. విండోస్ 11తో నడిచే ఈ డెస్క్‌టా‌ప్‌లో ఎంఎస్ ఆఫీస్ 2021 వెర్షన్ ఉంది. ఈ ఆఫర్లన్నీ కేవలం అమెజాన్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్‌లో లభిస్తాయి.