అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం..!

అమీర్‌పేట మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రివనం ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ హెల్మెట్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో భారీగా అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు..

ఓ బట్టల దుకాణంలో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బిల్డింగ్ మెుత్తం మంటలు వ్యాపించాయి. రెండో అంతస్థులో ఉన్న బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు రెప్పపాటు బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. ఆ మంటల సెగకు దగ్గరకు వెళ్లేందుకు కూడా స్థానికులు సాహసించలేకపోతున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..