బాలీవుడ్ న‌టి అమీషా ప‌టేల్ పై సివిల్ కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ..

ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చేమో గానీ 90స్ కిడ్స్ అడిగితే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బద్రి’లో నటించింది ఈ బ్యూటీనే కాబట్టి. ఆ తర్వాత కూడా మహేష్, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేసింది కానీ హిట్స్ అయితే కొట్టలేకపోయింది. దీంతో బాలీవుడ్ కు షిప్ట్ అయిపోయి అక్కడే సెటిలైపోయింది. ప్రస్తుతం హిందీ పంజాబీ, హిందీ చిత్రాల్లో నటిస్తుంది.

బాలీవుడ్ న‌టి అమీషా ప‌టేల్ లీగ‌ల్ చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. రాంచీ సివిల్ కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అమీషా, ఆమె బిజినెస్ పార్ట్న‌ర్ క్రునాల్ పై చెక్ బౌన్స్ కార‌ణంగా 420, 120 సెక్ష‌న్ ల కింద వీరిద్ద‌రిపై రాంచీ కోర్టు అరెస్ట్ వారెంట్ ని జారీ చేసింది. అమీషా ప‌టేల్ కు చెందిన `దేశీ మ్యాజిక్‌` మూవీలో పెట్టుబ‌డులు పెట్టుబ‌డులు పెట్టేందుకు అమీషా ప‌టేల్ రాంచీలోని హ‌ర్ము ప్రాంతానికి చెందిన అజ‌య్ కుమార్ సింగ్ ని సంప్ర‌దించింది.ఈ మూవీ మేకింగ్‌, ప‌బ్లిసిటీ కోసం అమీషా ప‌టేల్ అకౌంట్ కు అజ‌య్ కుమార్ సింగ్ రూ. 2.5 కోట్ల‌ని పంపించాడు. మూవీ పూర్త‌యిన త‌రువాత అస‌లుతో పాటు ఇంట్రెస్ట్ ని క‌లిపి అంద‌జేస్తామ‌ని అజ‌య్ కుమార్ సింగ్ కు అమీషా, క్రునాల్ తెలియ‌జేశార‌ట‌..

దేశీ మ్యాజిక్‌` షూటింగ్ ని 2013లో మొద‌లు పెట్టారు. ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ ఈ మూవీ రిలీజ్ కాలేదు. సినిమా నిర్మాణం ప్రారంభించి ప‌దేళ్లు అవుతోంది. అయినా అమీషా ప‌టేల్‌, క్రునాల్ నుంచి అజ‌య్ కుమార్ సింగ్ కు ఎలాంటి రిప్లై లేదు…డ‌బ్బు గురించి అడిగినా అమీషా స్పందించ‌డం లేద‌ట‌. చాలా రోజులు ఓపిక‌గా ఎదురు చూసిన అజ‌య్ కుమార్ ఫైన‌ల్ గా త‌న డ‌బ్బు త‌న‌కు కావాల‌ని నిల‌దీషాడ‌ట‌. దీంతో అక్టోబ‌ర్ 2018లో రెండు చెక్కుల‌ని అమీషా రూ. 2.5 ల‌కు ఒకటి, రూ. 50 ల‌క్ష‌ల‌కు మ‌రో చెక్ ని ఇచ్చింది. కానీ ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో ఆగ్ర‌హించిన అజ‌య్ కుమార్ సింగ్ రాంచీ సివిల్ కోర్టులో అమీషా, క్రునాల్ ల‌పై కేసు న‌మోదు చేశాడు. వెంట‌నే ఈ కేసుని విచారించిన కోర్టు హాజ‌రు కావాల‌ని కోరింది.

అమీషా ప‌టేల్‌, ఆమె త‌రుపు లాయ‌ర్ మాత్రం కోర్టులో హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన కోర్టు అరెస్ట్ వారెంట్ ని జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. గ‌తంలో రూ. 32.25 ల‌క్ష‌ల చెక్ బౌన్స్ కేసులో భోపాల్ కోర్టు అమీషా ప‌టేల్ కు నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ ని జారీ చేసింది. తాజాగా రాంచీ కోర్టు లోనూ ఇదే త‌ర‌హా కేసు న‌మోదు కావ‌డంతో అమీషా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `బ‌ద్రి` మూవీతో తెలుగు తెర‌కు అమీషా ప‌టేల్ ప‌రిచ‌య‌మైంది. ఆ త‌రువాత `నాని`, న‌ర‌సింహుడు, ప‌ర‌మ‌వీర‌చ‌క్ర వంటి సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం స‌న్నీడియోల్ హీరోగా `గ‌ద‌ర్ 2 : ది క‌థ కంటిన్యూస్‌`లో న‌టిస్తోంది.