కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం…తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం…అమిత్ షా…

*కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం: అమిత్ షా..

ఆదిలాబాద్ జిల్లా:

తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ లో జరిగిన గర్జనలో ప్రసంగించిన అమిత్‌షా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

డిసెంబర్‌3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్‌షా.. ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ విఫలం అయితే.. అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు హామీలు అమలు చేశారన్నారు.కేవలం కే టీ ఆర్, ను ఎలా సీఎంను చేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అమిత్ షా ఆరోపించారు.

గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మోదీ నిర్ణయించినా కేసీఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. చివరకు మోదీ 900 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రం అని కెసిఆర్ చెబుతున్నారు. నిజమే నెంబర్‌ వన్‌ చేశారు. ఉపాధి కల్పించడంలోనా, తాగునీరు ఇవ్వడంలోనా, ఉద్యోగాలు ఇవ్వడంలోనా కాదు, రైతు ఆత్మహత్యల్లో దేశంలో నెంబర్‌వన్‌, మహిళలు, చిన్నారులపై దాడుల్లో నెంబర్‌వన్‌, అవినీతిలోనూ నెంబర్‌వన్‌ అయింది.

పదేళ్లుగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని ఎలా చేయాలా అని ఆలోచించారు. ఈ ముఖ్యమంత్రి కేవలం తన కొడుకును సీఎం చేయడమే లక్ష్యం. కానీ మా లక్ష్యం ఆదిలాబాద్‌ గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు, విద్య, రైతులకు నీరు అందించడం మా లక్ష్యం.

కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఎక్కడ..? దళితులకు మూడెకరాలు ఎక్కడ? దళిత బంధు అందరికీ ఇచ్చారా..? మీ కార్యకర్తలను ఇచ్చుకున్నారు.. మిగిలినవారి సంగతేంటి?

గిరిజన వర్శిటీ మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ప్రకటించారు. మూడోది కృష్టా బోర్డు ట్రిబ్యునల్‌ విధివిధానాలు క్యాబినెట్‌లో ఇచ్చారు…