తెలంగాణ లొ అమిత్ షా ఖమ్మం పర్యటన షెడ్యూల్..!

హైదరాబాద్ :ఆగస్టు 25
ఈ నెల 27న ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో‌ జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

*అమిత్ షా ఖమ్మం పర్యటన షెడ్యూల్*

27న ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు కొత్తగూడెంకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి భద్రాచలం దేవాలయం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెంకు వస్తారు. అక్కడి నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్‌లో బయలుదేరి‌ 3.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

అనంతరం అక్కడ జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.

సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరానికి చేరుకుని.. సాయంత్రం 6.20 గంటలకు అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు…