అమిత్ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు…. కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!!!

అమిత్ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు..

న్యూఢిల్లీ .

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్‌ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన అమిత్‌ అరోరాను దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చారు.

◻️ ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్‌ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్లు విజయ్‌ నాయర్‌కు చేరాయని తెలిపింది. ఈ విషయాన్ని అమిత్‌ అరోరా ధ్రువీకరించారని ఈడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. ఇప్పటి వరకు ఈడీ ఎదుట అమిత్‌ అరోరా 22 సార్లు హాజరయ్యారని, ఫోన్‌ ద్వారా కూడా సమాచారం తీసుకున్నారని అమిత్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. 22 సార్లు ప్రశ్నించిన తర్వాత అమిత్‌ కస్టడీ అవసరం ఏంటని ఈ సందర్భంగా కోర్టు ఈడీని ప్రశ్నించింది. 3 సార్లు మాత్రమే వాంగ్మూలం నమోదు చేశామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

తదుపరి విచారణ కొనసాగింపు కోసమే కస్టడీ కోరుతున్నట్టు తెలిపారు…

?ఢిల్లీ లిక్కర్ స్కాం లో *ఎమ్మెల్సీ కవిత,వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు*

అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న ఈడి

ఢిల్లీ లిక్కర్స్ స్కాం మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరని అరెస్ట్ చేసిన ఈడి

సౌత్ గ్రూప్ నించి చెల్లించిన 100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర,కె కవిత,మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఈడి..

అమిత్ ఆరోరా తన ఫోన్ నుండి 10సార్లు కాల్ చేసినట్లు పేర్కొన్న ఈడీ..

25-12-2021,
23-01-2022,
08-08-2022
16-06-2022
31-12-2021
04-04-2022

6209999999 తో మాట్లాడిన కవిత..