కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయం..అమిత్‌ షా .

*తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు.* హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా, ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

*రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం.. అమిత్‌షాకాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయమని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌ మూడు వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని, 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామని అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా, మోదీ నామస్మరణే మార్మోగుతుందని అమిత్ షా అన్నారు.

*కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయం: అమిత్‌ షా తెలంగాణ ప్రజలు బీజేపీ 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌ ఒక్కటేనని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. మజ్లిస్‌ అజెండాతోనే హస్తం, గులాబీ పార్టీలు పనిచేస్తాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలే అన్నారు..