దళితబంధు కాస్త BRS ఎమ్మెల్యేలు కమీషన్ ల బంధు అయ్యింది…నల్గోండలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

దళితబంధులో BRS ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు..నల్గోండలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..నల్గొండలో బీజేపీ సభలో పాల్గొన్న అమిత్‌ షా. దళితబంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు..అంతేకాకుండా తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది.కేసీఆర్‌ ప్రభుత్వం ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయింది. ఓవైసీ మెప్పుకోసమే ఉర్ధూని రెండో భాషగా గుర్తించింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు కుటుంబ పార్టీలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. స్మార్ట్‌ సిటీస్‌ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం..