ఆసుపత్రిలో అమితాబ్ బచ్చన్..!

అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. 81 ఏళ్ల బిగ్ బి యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది..దీంతో అభిమానులు బిగ్ బి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్ బి నీనా గుప్తా నటించిన గుడ్ బై చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం బిగ్ బి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.

బిగ్ బీకి అస్వస్థత..

బాలీవుడ్ లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఈరోజు తెల్లవారుజామున అస్వస్తకు గురయ్యారు. తెల్లవారు జామున కాస్త నలతగా ఉండటంతో ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. బిగ్ బి ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.

ఏమైందో ఏమో..

గతంలో కూడా పలుమార్లు బిగ్ బి ఆసుపత్రికి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అయితే జనరల్ చెకప్ కోసం వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే 80ఏళ్లు నిండిన ఈ వృద్ధ నటుడు …ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు ప్రీ వెడ్డింగ్ బాష్ కి కూడా అటెండ్ అయ్యారు. కుటుంబ సభ్యులతో పార్టీకి అటెండ్ అయిన సమయంలో ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లుగా కనిపించారు.