అకౌంట్లో కోటి పది లక్షలు జమా…!..షాక్ అయిన కస్టమర్…!!

అకౌంట్లో క్రెడిట్ అయిన కోటి పది లక్షలను తిరిగి బ్యాంకుకి జమ చేసిన కస్టమర్..

చెన్నైలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అకౌంట్ లలో ఆదివారం కస్టమర్లకు సుమారు 100 మందికి 10వేల నుంచి 50 లక్షల వరకు, మరికొంతమందికి కోట్లలో అకౌంట్లలో నగదు క్రెడిట్ అయి సంచలనం సృష్టించిన సంగతి విధితమే. ఆ క్రమంలోనే మంగళగిరిలోని ఓ జనరల్ స్టోర్ యజమానికి కూడా కోటి పది లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవడం జరిగింది. దాంతో ఆ కస్టమర్ మరుసటి రోజు బ్యాంకుకి వెళ్లి తిరిగి నగదును బ్యాంకుకి జమ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…మంగళగిరిలో మెయిన్ బజార్ లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ యజమాని అరవపల్లి గౌరీశంకర్ కు చెందిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అకౌంట్ లో ఆదివారం కోటి పది లక్షల రూపాయలు క్రెడిట్ అయ్యాయి. దీంతో జనరల్ స్టోర్ యజమాని గౌరీ శంకర్ ఒక్కసారిగా కంగారు పడిపోయారు. ఆ తర్వాత చెన్నై హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో జరిగిన సాంకేతికపరమైన కారణం వల్ల ఈవిధంగా అకౌంట్లలో కోట్లలో డబ్బులు జమ అయినట్లు వివిధ టీవీ ఛానల్లో వార్తలు రావడం జరిగింది. దీంతో గౌరీ శంకర్ విషయం తెలుసుకొని ఆదివారం సెలవు కావడంతో సోమవారం బ్యాంకుకి వెళ్లి అకౌంట్లలో జమ అయిన కోటి పది లక్షల రూపాయల వివరాలను బ్యాంక్ అధికారులకు తెలియజేసి అకౌంట్ లో పడిన డబ్బులను తిరిగి బ్యాంకుకి జమ చేశారు…!!