మాటకి మాట సమధానం చెప్పండి.. సీఎం కేసీఆర్‌ చేసే ఆరోపణలకు దీటుగా సమాధానంఇవ్వాలి..హోం మంత్రి అమిత్‌ షా.

R9TELUGUNEWS.COM:.. సీఎం కేసీఆర్‌ చేసే ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సూచించారు. తెరాస బియ్యం కుంభకోణం, ఇతర అవినీతిని వెలికితీయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాసను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర భాజపా నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘‘కేసీఆర్‌ అవినీతిని ప్రజలకు వివరంగా చెప్పాలి. ఆయన అవినీతిపై విచారణకు డిమాండ్‌ చేయాలి. ప్రభుత్వాల మధ్య జరిగేది జరుగుతూ ఉంటుంది. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం లేదు.’’ అని అమిత్‌ షా అన్నారు…