అనకాపల్లి జిల్లా పూడిమడిక బీచ్ లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు…

పూడిమడక బీచ్ లో స్నానానికి దిగిన ఏఢుగురు విద్యార్థులు గల్లంతయ్యారు..

పూడిమడక బీచ్ వద్ద విషాద ఘటన సముద్రం వద్దకు వచ్చిన 15 మంది డైట్ విద్యార్థులు అలల తాకిడితో కొట్టుకుపోయిన విద్యార్థులు
ఒకరి మృతదేహం వెలికితీత

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. విహారానికి వచ్చిన విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్ లో సముద్ర స్నానాలకు దిగారు. అయితే అలల తాకిడికి వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు….

సీఎం జగన్ దిగ్భ్రాంతి.

అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు.