అనపర్తిలో మగ శిశువు కలకలం …

*అనపర్తి.. తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో అప్పుడే పుట్టిన మగ శిశువు కలకలం రేపిండి. గుర్తు తెలియని వ్యక్తులు అనపర్తి పాత ఊర్లోని బాపనమ్మ ఆలయం సమీపంలో రేకు షెడ్డులో అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్లారు ..

బాపనమ్మ ఆలయ సమీపంలో ఒక రేకు షెడ్ లో శిశువు ఏడుపును గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన మగ శిశువు ఏడుస్తూ కనిపించింది దీంతో స్థానికులు సర్పంచ్ వారాకుమారికి సమాచారం అనించారు ఆమే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన పోలీసులు శిశువును అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ సూపరిండెంట్ డాక్టర్ దాడి రామ గుర్రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శిశువుకు వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ గురెడ్డి మాట్లాడుతూ శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు ఎస్సై అప్పారావు మాట్లాడుతూ శిశువును ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల సమక్షంలో ఉంచమని శిశువు వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు సర్పంచ్ మాట్లాడుతూ శిశువు ఆరోగ్యంగా ఉందని శిశువును వదిలి వెళ్ళిన వారి వివరాలను సేకరించాలని పోలీసులను కోరమన్నారు …