అనంతగిరి హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం..!

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల కోసం నిర్వహించిన శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల పై స్వల్పంగా చర్చించినట్లు తెలిపారు. శిక్షణా శిబిరం ద్వారా పార్టీ నాయకులకు సంస్థాగత బలోపేతం, ప్రజాసమస్యల పై పోరాట విధానాలు, ఎన్నికల వ్యూహాల పై ప్రత్యేక అవగాహన కల్పించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…