అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్‌ మరో బాంబ్‌ పేల్చింది…

న్యూఢిల్లీ : అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్‌ మరో బాంబ్‌ పేల్చింది.

దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వివిఐపి హెలిక్యాప్టర్ల కుంభకోణం కేసుతో అదాని గ్రూపునకు సంబంధాలున్నాయని పేర్కొంది.

ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్‌, రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లోనూ చేర్చిన సింగపూర్‌కు చెందిన కంపెనీ అదానీ గ్రూప్‌ సంబంధిత సంస్థ అని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలో పేర్కొంది.

కాగా.. 2018లో ఇడి దాఖలు చేసిన మూడో చార్జిషీట్‌లో అనుహ్యాంగా ఆ పేరును తొలగించారని వెల్లడించింది. సింగపూర్‌లోని అధికారులు పంపిన లేఖ ఆధారంగా ఆ స్కామ్‌ నుంచి పేరును తొలగించారని సమాచారం.