బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ పరమ పవిత్రుడుగా మాట్లాడుతున్నారని, కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుపుతోందని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధించలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన జరగదని అద్దంకి దయాకర్ఆరోపించారు.
శుక్రవారం ఉదయం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్, పనిలో పనిగా బొగ్గు టెండర్లపై కూడా మాట్లాడుతూ . ప్రతిమ శ్రీనివాసరావు ఎవరు? సృజన్ రెడ్డి ఎవరు మీకు తెలీదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. కోల్ బ్లాక్ టెండర్లు నాలుగు బీఆర్ఎస్కు రాలేదా? టెండర్లు మీకు వస్తే కాంగ్రెస్ అవినీతి చేస్తుందా? అసలు అవినీతి అక్రమాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబమని తేల్చేశారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై అద్దంకి ఆగ్రహం
రాబందుల మాదిరిగతా తెలంగాణను దోచుకున్నదెవరు? మీరు అవినీతి చేయలేదని నిరూపిస్తారా? తాము నిరూపిస్తామని, మీరు సిద్దమేనా? అనైతిక, ఆక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ-కేసీఆర్ కుటుంబం కేరాఫ్ అడ్రస్గా ఆయన వర్ణిచారు. తెలంగాణకు మీర జమిలి దొంగలని, దోచుకున్నారని ఘాటుగా విమర్శించారు. పార్టీ ఫండ్ కోసం ఎవర్ని బెదిరించారో తెలీదా? మీ పార్టీ ఫండ్ రూ. 800 కోట్లు ఎలా అయ్యింది? నికర ఆస్తుల విలువ ఈసీకి ఇచ్చిన అఫిడవిట్లో చెక్ చేసుకోవాలన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959