అంగన్‌వాడీ దరఖాస్తులకు రేపటి వరకే గడువు…

అంగన్‌వాడీ దరఖాస్తులకు రేపటి వరకే గడువు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం చేపట్టిన అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జనగాం జిల్లాలో మంగళవారం గడువు ముగియనుంది. ఆ జిల్లాలో మొత్తం 46 పోస్టులున్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులై, స్థానికంగా నివాసం ఉండి, 21-35 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. రాజన్న సిరిసిల్ల, జనగాం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 282 పోస్టుల భర్తీకి కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకులు, మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఉన్నా యి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ గతవారం ముగిసింది.