ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి..!

*ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి*

నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో శనివారం ఏనుగు దాడికి గురై ఓ జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మృతుడు మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో యానిమల్ కీపర్‌గా పనిచేస్తున్నాడు.

శనివారం మధ్యాహ్నం షాబాజ్ తన దినచర్యలో భాగంగా ఏనుగు దగ్గరికి వెళ్లగా అతని వైపు దూసుకొచ్చి కీపర్‌ పై దాడి చేసింది. దీంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే అతను మార్గం మధ్యలోనే మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఏనుగుల దాడిపై నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు విచారణకు ఆదేశించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.