రణబీర్ కపూర్ యానిమల్ మూవీ రివ్యూ..!

నటీనటులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు

దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా

నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని

సంగీతం: JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్

సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్

ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ..

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన యానిమల్ మూవీ ఎట్టకేలకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది . మొదటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది..మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా టాక్ నమోదు చేసుకుంది . సినిమాలో ఎలాంటి వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేసామో అంతకు ట్రిపుల్ రేంజ్ లో వైలెన్స్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ .

అంతేకాదు సినిమాలో చాలా చాలా బోల్డ్ సీన్స్ లో రష్మిక -రణ బీర్ రెచ్చిపోయి నటించడం సినిమాకి మరింత ప్లస్ గా మారింది . తెరపై ఫాదర్ – సన్ సెంటిమెంట్ చూపిస్తూనే భార్యాభర్తల బంధాన్ని క్లియర్ గా కళ్ళకు కట్టినట్లు వివరించాడు సందీప్ రెడ్డివంగా . అప్పటివరకు చాక్లెట్ బాయ్ పాత్రలో కనిపించిన రణ బీర్.. ఒక్కసారిగా వైలెంట్ పాత్రలో కనిపించడంతో అభిమానుల సైతం ఈ సినిమాను బాగా లైక్ చేస్తున్నారు …

కథ: రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్) చిన్నప్పట్నుంచి తండ్రి మీద విపరీతమైన ప్రేమతో పెరుగుతాడు. తండ్రి తర్వాత తన కుటుంబానికి అన్నీ తానై చూసుకోవాలనుకుంటాడు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతడి ప్రేమ మెల్లమెల్లగా డామినేషన్ గా రూపాంతరం చెందుతుంది. తండ్రి వెళ్లిపోమాన్నాడని తాను ప్రేమించిన గీతాంజలి (రష్మిక మందన్న)ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళి స్థిరపడతాడు విజయ్..

అక్కడ నుండి విజయ్ జీవితం మొదలవుతుంది, ఇక కుటుంబంని తనే చూసుకోవాలని అనుకుంటాడు. అందుకే కాలేజీలో తన సిస్టర్ ని ఎవడో చెయ్యి పట్టుకున్నాడు అని తెలిసి కాలేజీకి గన్ పట్టుకెళ్లి బెదిరించి వాళ్ళందరినీ కొడతాడు. కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆపద వచ్చినా, విజయ్ ఎంతటి దూరం అయినా వెళతాడు. తండ్రి కొడుకు ప్రవర్తన చూసి వాడు పెద్ద క్రిమినల్ అని, ఎలా తయారవుతాడో అని ఇంటి నుండి వెళ్లిపొమ్మంటాడు. గీతాంజలి (రష్మిక మందన్న) అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో అమెరికాలో ఉన్న విజయ్ తండ్రి మీద ఎవరో మర్డర్ చెయ్యడానికి ప్రయత్నించారని ఇండియా వచ్చాడు? అప్పుడు విజయ్ ఏమి చేసాడు, ఎలా తండ్రిని కాపాడుకున్నాడు? బాబీ డియోల్ కి విజయ్ కి ఏంటి వైరం? తండ్రి బలబీర్ మీద ఎవరు దాడి చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘యానిమాల్’ చూడాల్సిందే…
హీరో క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టి కనీసమైన లాజిక్కుల్ని కూడా పక్కన పెట్టేశాడు దర్శకుడు. సినిమా అనేది లాజిక్ తో కాదు మేజిక్ తో వర్కౌట్ అవుతుందని వాదించవచ్చు. కానీ ఆ మేజిక్ కొరవడినప్పుడే ప్రేక్షకుల దృష్టి లాజిక్ మీదకు వెళ్తుంది.

– ఒక పెద్ద పారిశ్రామికవేత్త కూతుర్ని కాలేజిలో ర్యాగింగ్ చేస్తే అతని తమ్ముడు పనిగట్టుకుని వెళ్లి వార్ణింగివ్వాలా? పక్కన తగలడ్డ బాడీ గార్డ్స్ ఏం చేస్తున్నట్టు? పైగా అది సొంత కాలేజి కూడానట!!

– హీరో గొంతు పిసికి ఒకడిని పబ్లిక్ గా చంపుతాడు. ఆ విషయం దాదాపు కథ కంచికి చేరే వరకు ఎవ్వరికీ తెలియకపోవడమేంటి? ఆ పబ్లిక్ లో ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పలేదా?

– హీరో అరివీరభయంకరంగా కేజీఎఫ్ లెవెల్లో ఫైటింగ్ చేస్తుంటే అతని వెంటనున్న ఫైటర్లు ఫైటింగులో సాయం చేయకుండా హీరోకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ పాట పాడుతుంటారు చీర్ బాయ్స్ లాగ!

– బాడీ డబుల్ సీనైతే చెప్పక్కర్లేదు. చాలా కామెడీగా, అతిగా ఉంది.

ఇలా లాజిక్ మిస్సయ్యేవి కొన్ని, నాన్ సింక్ లో పడి కొట్టుకునే సీన్లు కొన్ని.. వెరసి స్క్రిప్టులో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

వీటికి తోడు కథకి అవసరంలేని సీన్లు బోలెడన్ని ఉన్నాయి. ముఖ్యంగా లాండ్రీలో అండర్వేర్ సీన్, సెక్సాలజిస్ట్ అడిగే సెక్స్ ప్రశ్నలు, ఎంతకీ ముగియని ప్రీ ఇంటర్వల్ ఫైట్.. ఇవన్నీ కోసి పారేసుంటే కనీసం పావుగంటైనా తగ్గేదేమో నిడివి. 3 గంటల 21 నిమిషాలు ఒక సినిమాని కదలకుండా చూడాలంటే స్క్రీన్ ప్లేలో ఎంత పట్టుండాలి!

తొలి సగంలో మొదటి సగం గ్రిప్పింగ్ గా సాగితే ఆ తర్వాత నుంచి జీడిపాకంలా సాగింది. అప్పటి వరకు ఫ్యామిలీ డ్రామాగా జరిగిన కథలో ఒక వెపన్ డీలర్ ఎంట్రీతో సడెన్ గా వేరే సినిమా చూస్తున్నామా అనే ఫీలింగొస్తుంది.

సెకండాఫైతే ఒక డైలీ సీరియల్ ని సినిమా హాల్లో చూస్తున్నట్టు ఉంటుంది. కథ అక్కడక్కడే ఉంటూ ముందుకి కదలనట్టు ఉంటుంది. సినిమా ఇంకో ముప్పావు గంటలో ముగుస్తుందనగా బాబీ డియోల్ పాత్ర రంగప్రవేశం. మళ్లీ అతని క్యారక్టర్ పరిచయం తర్వాత, అతని వయొలెంట్ సీన్లు కొన్ని దర్శనమిచ్చి చివరికి ఒక ఫైటుతో ముగుస్తుంది.

హింసాత్మక సన్నివేశాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్లంతా ఏది చూపిస్తే అది చూసేయగలరని అనుకోనక్కర్లేదు. సెన్సార్ బోర్డ్ కూడా ఈ విషయంలో కాస్త మెదడు వాడలి. పచ్చి బూతులు, నగ్న సన్నివేశాలు, గొంతుని పరపరా కోసే సీన్లు అవసరమా? కట్ చేయొద్దూ!

ఏమైనా అంటే దర్శకులు క్రియేటివ్ ఫ్రీడం అని గగ్గోలు పెడతారు. ఆ ఫ్రీడం పేరుతో ఈ చెత్తనంతా పోగేసి చూపించి నాలుగు కాసులొస్తే కాళాత్మక దిగ్గజ దర్శకులైపోరు.

ఇందులో హీరో ఒక్కడే కాదు. హీరోయిన్ ప్రవర్తన కూడా అతిగానే ఉంటుంది. ఆమె క్యారెక్టర్ మైల్డో, వైల్డో అర్ధమవ్వదు.

టెక్నికల్ గా సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ రిచ్ గా ఉంది..

విశ్లేషణ:

దర్శకుడు సందీప్ రెడ్డి ఇంతకు ముందు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘అర్జున్ రెడ్డి’ చేసాడు. అదే సినిమాని హిందీలో రీమేక్ చేసాడు. రెండూ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఈ ‘యానిమల్’ మూడో సినిమా, చెప్పాలంటే రెండో సినిమా, ఎందుకంటే రెండో సినిమా రీమేక్. సందీప్ తనదైన శైలి ఎంచుకున్నాడు కథలు చెప్పడానికి, అందులో హింస ఉంటుంది, కర్స్ పదాలు ఉంటాయి, అవి కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. కానీ అతను ఏమి చెప్పాలనుకున్నాడో అది మొహమాటం లేకుండా చెపుతున్నాడు. అందుకే అతని సినిమాలు కుటుంబంతో చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ‘యానిమల్’ సినిమాలో రెండో సగంలో రష్మీక, రణబీర్ మధ్య వచ్చే సన్నివేశాలు అలాంటివి. కానీ ప్రతి పాత్రలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది సందీప్ సినిమాల్లో…

రణ్ బీర్ కి నటన పరంగా పూర్తి మార్కులేయాలి. చాలా వైవిధ్యాలు చూపిస్తూ ఎక్కడా తేడా కొట్టకుండా నటించాడు.

రష్మిక మందన్న కూడా నటన బాగా చేసింది. అయితే ఆమె పాత్ర రచన మరింత బలంగా ఉండుండాల్సింది.

తృప్తి డిమ్రి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. హీరోతో ఒక పూర్తి నగ్న సన్నివేశంలో కనపడింది.

అనీల్ కపూర్ నటన పర్ఫెక్ట్. తాత పాత్రలో సురేష్ ఒబేరాయ్ కనిపించారు. అలనాటి పాపులర్ నటుడు ప్రేం చోప్రా కూడా ఒక పాత్రలో దర్శమిచ్చారు. పృథ్వి పాత్రకి పెద్ద నిడివి లేదు.

బాబీ డియోల్ ఉన్నంతలో ఉనికి చాటుకున్నాడు.

ఎలా చూసుకున్నా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రం కాదు. అడల్ట్స్ లో కూడా ఎవరికైతే పైన చెప్పుకున్న అంశాల పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్లు ట్రై చేయొచ్చు.

వైల్డ్ యానిమల్స్ ని జూలో చూస్తాం. అత్యంత తీవ్రమైన భావోద్వేగాలతో బతికే మనిషిని చూడాలంటే మాత్రం జూకెళ్లొచ్చినట్టు థియేటర్ కి వెళ్లి చూడాలి.

కపూర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే అందరు “రాక్ స్టార్” అనేవారు. “యానిమల్” ఇప్పుడు ఆ స్కేల్ ను మార్చేసింది. ఒక నటుడిగా రణబీర్ కపూర్ పూర్తిస్థాయి పొటెన్షియల్ ను యూజ్ చేసుకున్న సినిమా ఇది. అతడిలోని భిన్నమైన ఎమోషన్స్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించారు. ఒక నటుడిగా రణబీర్ కపూర్ లోని క్రోధాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన పాత్ర రన్ విజయ్ సింగ్ బల్బీర్.

ఈ సినిమా/పాత్ర నుండి అతడు బయటకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు, లేదా ప్రేక్షకులు మళ్ళీ అతడ్ని ఒక సాధారణ నటుడిలా యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ.. రణబీర్ కపూర్ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాత్ర/సినిమాగా “యానిమల్” మిగిలిపోతుంది. రష్మిక మందన్న నటిగా తేలిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే 15 నిమిషాల ఎమోషనల్ సీన్ లో ఆమె నటన, డైలాగ్ డెలివరీ చాలా పేలవంగా ఉంది. నటిగా ఆమెకు ఈ సినిమా ఏమైనా ప్లస్ అవ్వోచ్చేమో కానీ..