వరంగల్‌ జిల్లాలో గొర్రెలకు ఆంత్రాక్స్‌ నిర్ధారణ

వరంగల్‌ జిల్లాలో గొర్రెలకు ఆంత్రాక్స్‌ నిర్ధారణ.

R9TELUGUNEWS.com.
వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో మృతి చెందిన గొర్రెలకు ఆంత్రాక్స్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఇటీవల ఈ గ్రామానికి చెందిన సాంబయ్య అనే రైతు గీసుకొండ మండలం కొమ్మాల సంతలో కొనుగోలు చేసిన అయిదు గొర్రెలు మరణించాయి. విషయం తెలుసుకున్న జిల్లా పశు వైద్యాధికారులు నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించారు. అయిదు రోజుల అనంతరం శుక్రవారం ఆ నమూనాల తాలూకు ఫలితాలు వచ్చాయి. గొర్రెలు ఆంత్రాక్స్‌తోనే మృతి చెందినట్లు పరీక్షల్లో వెల్లడైంది. అప్రమత్తమైన అధికారులు చాపలబండతో పాటు పరిసర గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు టీకాలు వేయడానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం బెంగళూరు నుంచి 8 వేల డోసుల ఆంత్రాక్స్‌ నివారణ టీకాలు గురువారం వరంగల్‌కు చేరుకున్నాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.బాలకృష్ణ తెలిపారు.