ఏపీలో ఎన్నికలకు ప్రక్రియ ప్రారంభం…

*.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్‌ను బుధ‌వారం విడుదల చేశారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌ కుమార్ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాలకు ఆర్‌ఓల నియామకం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో తొలి అంకం ప్రారంభమైంది.*