బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజీనామా..!! ఈ వార్తలో నిజం ఎంత స్పందించిన బిజెపి..!!

బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజీనామా చేసినట్టు ఒక పత్రిక ప్రకటన విడుదల అవ్వడం, అది విపరీతంగా ట్రెండ్ అవ్వడం మనమంతా చూసాము…అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని బీజేపీ పార్టీ సోషల్ మీడియా అధికారిక ప్రకటన చేసింది. ‘సోషల్ మీడియా లో ఒక ఫేక్ లెటర్ చక్కర్లు కొడుతోంది. పురందేశ్వరి బీజేపీ కి రాజీనామా చేసారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎన్డీయే వ్యతిరేక శక్తులు చేసే దుష్ప్రచారాలు నమ్మి మోసపోకండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఆమె చిలకలూరిపేట లో జరిగిన టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి భారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగం ని తెలుగు లో అనువదిస్తూ ఉపన్యాసం ఇచ్చింది. ఇంత రాజీనామా ఎలా చేసింది అని బీజేపీ అభిమానులు షాక్ కి గురి అయ్యారు. అయితే అదంతా ఫేక్ ప్రచారం అని తెలియడం తో ఊపిరి పీల్చుకున్నారు..