బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో భేటీ..

బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ బుధవారం ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు..
ఈ సందర్భంగా, ఏపీ లో పార్టీ పటిష్టత తదితర అంశాల పై చర్చించారు. తనను ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించినందుకు మరోసారి సీఎం కేసీఆర్ కు తోట’ కృతజ్జతలు తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారథి తదితరులున్నారు.