ఏపీ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ. విజయవంతంగా ముగిసింది….

r9telugunews.com: ఏపీ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, ఆర్‌.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సినిమా టికెట్ల ధరల అంశంపై సీఎంకు వారు వివరించనున్నారు. జీవో నం 35లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు, సినిమా టికెట్‌ ధరలపెంపు, ఏసీ, నాన్ ఏసీ థియేటర్లలో కనీస, గరిష్ఠ టికెట్ ధరల పెంపు, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో ఆహారపదార్థాల ధరలపై వీరంతా సీఎంతో చర్చించనున్నారు. థియేటర్ల వర్గీకరణ, ధరల పెంపుపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో దానిపైనా చర్చించే వీలుంది. మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం.. పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమైన తరుణంలో ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. ఈ సమావేశంతో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

*ఒకే విమానంలోనే అందరూ..*

చిరంజీవి తనకే ఆహ్వానం అందిందని తొలుత మీడియాతో చెప్పినప్పటికీ సమావేశానికి హాజరైన సినీ ప్రముఖులతో ఒకే విమానంలో ప్రయాణించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. మహేశ్‌బాబుకు చిరంజీవి పుష్పగుచ్ఛం అందజేస్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. ఈరోజు మహేశ్‌-నమ్రత వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సినీ ప్రముఖులు భేటీ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినీ ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్‌ తీసుకున్నారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపైనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చర్చ జరుగుతుంది. ఇప్పటికే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సెలబ్రిటీలు కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇందుకోసం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు టాలీవుడ్‌ బృందం. సినిమా టికెట్ల ధర సహా ఇతర అంశాలపై ప్రధానంగా ఈ భేటీ జరగనుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, అలీ, పోసాని కృష్ణమురళి వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. అయితే ఈ భేటీలో నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొనకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్‌ను కలిసే లిస్ట్‌లో వీరిద్దరి పేర్లు ఉన్నా చివరి నిమిషంలో ఎందుకు గైర్హాజరయ్యారు అన్నదానిపై ఇప్పుడు చర్చకు దారితీసింది. కాగా అక్కినేని అమలకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న నాగార్జున ఈ కారణంగానే భేటికి దూరంగా ఉన్నట్లు సమాచారం. మరి తారక్‌ విషయంలో వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్నదానిపై ఇంకా తెలియాల్సి ఉంది…